telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఇరిగేషన్‌ రంగానికి అత్యధిక ప్రాధాన్యత: సీఎం కేసీఆర్

KCR cm telangana

తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ రోజు కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టుకు గోదావరి జలాలు విడుదల చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాదారు. రైతులు అద్భుతాలు సృష్టించే రోజులు త్వరలో రాబోతున్నాయని అన్నారు. ఇరిగేషన్‌ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు చెప్పారు.

నియంత్రిత సాగుకు మద్దతు తెలుపుతూ ఇప్పటికే వేలాది గ్రామాలు తీర్మానం చేశాయి. దేశానికి మనం ఆదర్శం కావాలి. 530 టీఎంసీల నీళ్లను వాడుకోగలిగే సామర్థ్యాన్ని తెలంగాణ సంతరించుకుందన్నారు. నదీ జలాల తెలంగాణ, ధాన్యరాశుల తెలంగాణ అంటూ గతంలో కొందరు కవులు తెలంగాణను కీర్తించిన వైనాన్ని ఆయన వెల్లడించారు.

Related posts