telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

వైసీపీ నేతల జేబులు నింపడం కోసమే ఇసుక కొరత: చంద్రబాబు ఫైర్

chandrababu gift on may day

వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఇసుక పాలసీ విధానం పై ఏపీ మాజీ సీఎం చంద్రబాబు ట్విట్టర్ లో విమర్శలు గుప్పించారు. వైసీపీ నేతల జేబులు నింపడం కోసమే ఇసుక కొరతను సృష్టించారని మండిపడ్డారు. ఇసుకను తవ్వడం దగ్గర నుంచి తరలించడం, నిల్వచేయడం, అమ్ముకోవడం అంతా అక్రమమేనని ఆరోపించారు.

వైసీపీ నేతల కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతోందని దుయ్యబట్టారు. అందుకే ఈ అక్రమాలపై చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. వైసీపీ ప్రభుత్వ అక్రమాల కారణంగా నిర్మాణరంగంలో కార్మికులుగా పని చేస్తున్న ఎంతో మంది కష్ట జీవులకు పనులు లేకుండా పోయాయని తెలిపారు. పార్టీలోని వ్యక్తులను మేపడం కోసం బడుగువర్గాలను పస్తులుంచడం దుర్మార్గమని అన్నారు.

Related posts