telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

ఏసీబీ వలకు చిక్కిన అవినీతి చేప

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో మరో అవినీతి చేప ఏసీబీ అధికారులకు పట్టుబడింది. అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం తుర్కయాంజల్‌ గ్రామ వీఆర్వో శంకర్‌ రైతు వద్ద లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ముత్యంరెడ్డి అనే రైతు తనకు చెందిన ఎకరా ఇరవై గుంటల(1.20) భూమి పట్టా అమలు కోసం వీఆర్వో శంకర్‌ను కలిశాడు. అతడు రైతును లక్ష రూపాయలు లంచం అడిగాడు.

డబ్బిస్తేనే పనవుతుందని రైతుకు నిర్మొహమాటంగా తెలిపాడు. దీంతో వీఆర్వోకు లక్ష రూపాయలు ఇవ్వలేననీ, 70 వేల రూపాయలు ఇస్తానని ఒప్పుకున్నాడు. తదనంతరం, రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పథకం ప్రకారం రైతు ముత్యం రెడ్డి వీఆర్వోకు డబ్బు ఇస్తుండగా ఏసీబీ అధికారులు అతడిని వలపాన్ని పట్టుకున్నారు. అనంతరం వీఆర్వో కార్యాలయంలో అధికారులు సోదాలు నిర్వహించారు.

Related posts