కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టంపై దేశంలో నిరసనలు కొనసాగుతున్నాయి. విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు నిరసనలో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పందించారు. ఏఏను వెనక్కి తీసుకునేది లేదని కేంద్ర కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ చట్టం వల్ల భారతీయులకు ఎలాంటి నష్టం లేదని అన్నారు.
శ్రీలంక తమిళులకు కూడా పౌరసత్వాన్ని కల్పిస్తామని తెలిపారు. మేథావులు, ప్రజలు సరైన దిశగా ఆలోచించాలని సూచించారు. మోదీ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికే విపక్షాల ఆందోళనలు చేస్తున్నాయని ఆరోపించారు. ఆందోళనల వెనుక విదేశీకుట్ర ఉందని కిషన్‌రెడ్డి విమర్శించారు.
కోడెల బాంబులకు భయపడలేదు..నీచ రాజకీయాలకు బలయ్యారు: దేవినేని