telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

అయోధ్య తీర్పు నేపథ్యంలో.. దేశంలో భారీ భద్రత .. యూపీకి మరిన్ని బలగాలు..

ayodya case hearing will end tomorrow

అయోధ్య వివాదంపై తీర్పు వెలువడనున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. సున్నిత ప్రాంతాలను గుర్తించిన పోలీసులు హిందూ, ముస్లిం వర్గాలకు చెందిన నేతలతో సమావేశాలు ఏర్పాటు చేశారు. ఎలాంటీ తీర్పు ఉన్న స్వాగతించే విధంగా అవగాహాన కల్పిస్తున్నారు. తీర్పు వెలువడనున్న నేపథ్యంలోనే ఎక్కడ ఎలాంటీ అవాంచనీయ సంఘటనలు జరగుకుండా పలు చర్యలు చేపట్టారు. ముఖ్యంగా యూపీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇప్పటికే రాష్ట్ర బలగాలు మోహరించిన నేపథ్యంలోనే మరో నాలుగువేల మంది అదనపు కేంద్ర పోలీసు బలగాలను యూపీకి పంపనుంది. భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గగోయ్ అయోధ్య స్థల వివాదంపై తీర్పును వెలువరించనున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. అయోధ్య తీర్పును రంజన్ గోగొయ్ పదవి వివరణ చేస్తున్న నవంబర్ 18వ తేదీ నాటికి అయోధ్య కేసుతో పలు కీలక కేసుల్లో తీర్పును వెలువరించనున్నట్టు ప్రకటించారు.

యూపీ ముఖ్యమంత్రి యోగి అధిత్యానాథ్ ఇప్పటికే రాష్ట్రంలో పలు హెచ్చరికలు జారీ చేశారు. ఎవ్వరు కూడ రాజకీయంగా అయోధ్య తీర్పుపై ప్రసంగాలు చేయకూడదని పార్టీ నాయకులకు ఆంక్షలు విధించారు. దీంతో భద్రతపరంగా కూడ చర్యలు చేపట్టారు. ఇందుకోసం సమస్యత్మక ప్రాంతాల్లో భారిగా పోలీసులను మోహరించారు. మరోవైపు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కూడ చర్యలు చేపట్టింది. యూపీకి 15 కంపనీల సాయుధ పోలీసులను పంపాలని నిర్ణయించారు. నబంబర్ 11వ తేదిన పోలీసులు రాష్ట్రానికి వెళ్లనున్నట్టు వెల్లడించారు. అయితే కొద్ది రోజులు మాత్రమే రాష్ట్రంలో మాకం వేసేందుకు నిర్ణయించారు. దీంతో రంజన్ గగోయ్ పదవి విరమణ చేసే తేదివరకు బలగాలను కొనసాగించనున్నట్టు తెలుస్తోంది.

Related posts