telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

కేంద్రంతో రైతుల 8వ విడత చర్చలు…

గత 40 రోజులకు పైగా ఢిల్లీలో రైతుల ఉదయం కొనసాగుతుందిఈ తరుణంలో ఈరోజు రైతులతో కేంద్రం 8 వ విడత చర్చలు జరపబోతున్నది.  వ్యవసాయ బిల్లుల్లో సవరణలు చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే అంగీకరించింది.  అయితే, రైతులు మాత్రం వ్యవసాయ చట్టాలను పూర్తిగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.  ఢిల్లీ సరిహద్దుల్లో నెలరోజుల నుంచి నిరసనలు తెలుపుతున్నారు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటల సమయంలో విజ్ఞాన్ భవన్ లో చర్చలు జరగబోతున్నాయి.  40 రైతు సంఘాలు ఈ చర్చల్లో పాల్గొనబోతున్నాయి.  ఈరోజు జరిగే చర్చల ఫలితాలను ముందుగానే చెప్పలేమని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పేర్కొన్నారు.  ప్రతిష్టంభనను తొలగించేందుకు మత గురువులకు ఎలాంటి ప్రతిపాదనలు ఇవ్వలేదని తోమర్ స్పష్టం చేశారు.  రైతు సంఘాల నేతలకు ఎలాంటి ముందస్తు ప్రతిపాదనలు ప్రభుత్వం ఇవ్వలేదని తెలిపారు.  మూడు చట్టాల ద్వారా వ్యవసాయ రంగంలో తేనున్న సంస్కరణలు కేవలం ప్రారంభం మాత్రమే అని, రానున్న రోజుల్లో క్రిమి సంహారణ మందుల బిల్లు, విత్తనం బిల్లులను కూడా తీసుకురానున్నామని కైలాష్ చౌధురి పేర్కొన్నారు.  అయితే మూడు చట్టాల ఉపసంహరణకు రైతు సంఘాల నేతలు పట్టుబడుతున్నారు.  కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

Related posts