telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు వార్తలు

నిద్రిస్తుండగా యువకుని దారుణ హత్య

Parents Murdered Daughter at Mancherial

కడప జిల్లాలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. వేముల మండలంలోని గొల్లలగూడూర్ గ్రామంలోని సిగం మనోహర్ రెడ్డి రెడ్డి(35) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గురువారం తెల్లవారుజామున ఇంటిబయట నిద్రిస్తుండగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా నరికి చంపారు. దీంతో మనోహర్ ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి.

స్థానిక సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి సి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్యకు అక్రమ సంబంధమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనకు పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలని మనోమర్ కుటుంబ సభ్యులు పోలీసులను కోరారు.

Related posts