తెలుగు మీడియా రాను రాను కొత్త పుంతలు తొక్కుతూ వచ్చింది… కొన్ని స్టాండర్డ్ పేపర్లు, న్యూస్ ఛానెళ్లు ప్రేక్షకులకు సరైన వార్తలు చేరవేసేందుకు కృషి చేస్తుండగా.. మరికొన్ని ఛానెళ్లను, పేపర్లను మాత్రం ఏదో ఒక పార్టీ వెనకుండి నడిపిస్తుందేమోనన్న అనుమానం ప్రేక్షకుల్లో కలిగేలా కథనాలు ఉంటున్నాయి. ఇక, చిన్నా చితక ఛానెళ్లు, న్యూస్ పేపర్లకు కొదవేలేదు.. పారిశ్రామికవేత్తలు చాలా మంది మీడియావైపు అడుగులు వేస్తూ వచ్చారు.. కరోనా దెబ్బతో రావాల్సిన కొన్ని ఛానెళ్లు కూడా వెనక్కి వెళ్లాయని చెబుతుంటారు.. మరోవైపు.. సోషల్ మీడియా రకరకాల పుకార్లను షికార్లు చేయిస్తూనే ఉంది.. తాజాగా ప్రతిమ గ్రూప్ సంస్థల చైర్మన్ బోయినపల్లి శ్రీనివాసరావు కూడా టీవీ రంగంవైపు అడుగులు వేస్తున్నారని ప్రచారం అందుకుంది సోషల్ మీడియా… ప్రతిమ గ్రూప్.. టీవీ 5 న్యూస్ ఛానెల్‌ను కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తోందని.. త్వరలోనే ఆ ఛానెల్ ప్రతిమ గ్రూప్ హస్తగతం చేసుకోబోతోందని వాటి సారాంశం.
అయితే, ఈ వార్తలను కొట్టిపారేస్తోంది ప్రతిమ గ్రూప్.. ఈ గ్రూప్ కింద ఇప్పటికే ఆస్పత్రులు, ఇతర వ్యాపారాలు చేస్తూ వస్తున్నారు బోయినపల్లి శ్రీనివాసరావు.. ప్రముఖ పత్రికలోనూ ఆయనకు షేర్లు ఉన్నాయని చెబుతారు. ఇక, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, ఆయన కుటుంబానికి సన్నిహితంగా మెలిగే వ్యక్తి… ఆయనకు టీవీ5ని కొనే ఆలోచనే లేదంటున్నారు. టీవీ రంగంపై ఆయనకు ఎలాంటి ఆసక్తి లేదు.. ఏ టీవీ ఛానెల్‌ను ఆయనకు సొంతం చేసుకోవడానికి ప్రయత్నాలు చేయడం లేదని క్లారిటీ ఇస్తున్నారు.
టీం ఇండియా గెలుపు కోసమే సానియా అక్కడికి వెల్లిందట!