telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

కరోనా బారిన పడిన అమెరికా వైట్ హౌస్‌ చీఫ్…

ప్రస్తుతం ప్రపంచ దేశాలు అన్ని అమెరికా అధ్యక్ష ఎన్నికల వైపు చుస్తునాయి. ఈ ఎన్నికల్లో డోనాల్డ్‌ ట్రంప్‌ ఎదురీదుతున్నారు. అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికల ఫలితాల్లో ట్రంప్ వెనుకంజలో ఉన్న విషయం తెలిసిందే. ఇక ఈ ఎన్నికల్లో అమెరికా అధ్యక్ష పీఠానికి ఎవరు చేరతారన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో ట్రంప్ కు కరోనా మరోసారి దడపుట్టిస్తుంది. తాజాగా వైట్ హౌస్ చీఫ్, నార్త్ కరోలినా మాజీ శాసనసభ్యుడు మార్క్ మెడోస్ కరోనా బారిన పడినట్టు తెలుస్తోంది. తనకు ప్రాణాంతకమైన వైరస్‌ సోకిందని మెడోస్ తన సన్నిహితులకు చెప్పినట్లు సమాచారం. ఎన్నికల ప్రచారంలో దేశవ్యాప్తంగా నిర్వహించిన  ర్యాలీల్లోనూ ట్రంప్‌తో కలిసి వీరు పాల్గొన్నారు. అంతేకాదు పలువురు ట్రంప్ ముఖ్య అనుచరుల పాల్గొన్న ఎన్నికల రాత్రి వైట్హౌస్‌ పార్టీలో కూడా మెడోస్‌ పాల్గొన్నారని రాయిటర్స్‌ తెలిపింది. ఎన్నికల అనంతరం తనదే విజయమంటూ ట్రంప్ ప్రకటించిన సమావేశానికి మాస్క్‌ లేకుండా మెడోస్‌ హాజరయ్యారు. కాగా డొనాల్డ్‌ ట్రంప్‌ అతని భార్య మెలానియా, కుమారుడు బారన్‌ కూడా కరోనా సోకినా విషయం తెలిసిందే.

Related posts