telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీకి వచ్చే పరిశ్రమలు తరలిపోతున్నాయి: ఎమ్మెల్సీ మాధవ్

madhav bjp mlc

ఆంధ్రప్రదేశ్ కు వచ్చే పరిశ్రమలు వేరేచోటికి తరలిపోతున్నాయని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. శాసనసభ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ వ్యాఖ్యలతో నిర్మాణ సంస్థలు ఇబ్బంది పడుతున్నాయనివిమర్శించారు. రాజధాని అమరావతి నిర్మాణం తన ప్రాధాన్యత కాదని జగన్ చెప్పటంతో నిర్మాణ సంస్థలు ఇబ్బందులు పడుతున్నాయని, రాష్ట్రంలో భవన నిర్మాణ పనులు నిలిచిపోయాయని అన్నారు. రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలు వేరే చోటుకి తరలిపోతున్నాయని, జగన్ ప్రభుత్వం రాజధాని కోసం కొత్త డీపీఆర్ ఇస్తే కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుందని అన్నారు.

అమరావతి నిర్మాణానికి కేంద్రం ఇచ్చిన నిధులకు సంబంధించిన లెక్కలు చెప్పడంలో గత ప్రభుత్వం విఫలమైందని అన్నారు. ఈ సందర్భంగా విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి గత ప్రభుత్వం చేసుకున్న పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ (పీపీఏ)ల అంశం గురించి ప్రస్తావించారు. గత ప్రభుత్వం చేసుకున్న పీపీఏల జోలికి వెళ్లొద్దని కేంద్ర ప్రభుత్వం లేఖ రాసిన లేఖల గురించి మాధవ్ ప్రస్తావించారు. ఈ లేఖలను రాష్ట్ర ప్రభుత్వం గౌరవించాలని సూచించారు. ఒకసారి ఒప్పందం జరిగిన తర్వాత మళ్లీ వాటి జోలికి వెళ్లడం సరికాదని అన్నారు.

Related posts