telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

షారుఖ్ పై సల్మాన్ వీడియో… ఇంస్టాగ్రామ్ క్రాష్

Salman-and-Sharuk

బాలీవుడ్ స్టార్స్ సల్మాన్, షారుక్‌ని ఒకే స్క్రీన్‌పై చూడాలని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ ఎందరో ఉన్నారు. అయితే షారుక్ చేసిన ఓ సాహసవంతమైన పనిని మెచ్చుకుంటూ సల్మాన్ ఖాన్ పోస్ట్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. షారుక్ నటించిన ‘హ్యాపీ న్యూఇయర్’ సినిమాలోని ఓ క్లిప్ అది. వీడియోలో షారుక్ షర్ట్‌కి మంటలు వ్యాపించినా కూడా ఆయన ఏమీ కానట్లు వెళ్లిపోతుంటాడు. ఇంతకీ సల్మాన్ ఈ వీడియో ఎందుకు పోస్ట్ చేశాడంటే.. ఇటీవల బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఇంట్లో అపశృతి చోటు చేసుకుంది. దాదాపు మూడేళ్ల తర్వాత అమితాబ్ ముంబయిలోని తన నివాసంలో ఇటీవల దీపావళి వేడుకలు నిర్వహించారు. బాలీవుడ్‌కి చెందిన ఎందరో అతిరథమహారథులు వేడుకకు హాజరయ్యారు. ఐశ్వర్య రాయ్‌ వద్ద మేనేజర్‌గా పనిచేసిన అర్చనా సదానంద్ అనే యువతి కూడా వేడుకకు వెళ్లింది. అయితే ఆమె లెహంగా దీపాల మధ్య చిక్కుకుని మంటలు అంటున్నాయి. అక్కడే ఉన్న షారుక్ ఖాన్ వెంటనే అప్రమత్తమై మంటలు అదుపు చేశారు. అర్చన చేతికి కాలికి 15 శాతం గాయాలయ్యాయి. ఆమెను వెంటనే దగ్గర్లోని లీలావతి హాస్పిటల్‌కు తరలించారు. రియల్ లైఫ్‌లోనూ షారుక్ హీరో అనిపించుకున్నారని కాంప్లిమెంట్ ఇస్తూ సల్మాన్ ఈ వీడియోను పోస్ట్ చేశాడు. ‘మంటల్లో దూకి ఎవరినైతే రక్షిస్తాడో అతడినే హీరో అంటాడు’ అని సల్మాన్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. ఇంకేముంది.. సల్మాన్ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగానే ఫ్యాన్స్ టకటకా లైక్ బటన్ నొక్కిపడేశారు. దాంతో కాసేపటి వరకు సల్మాన్ ఇన్‌స్టాగ్రామ్ క్రాష్ అయింది. దాదాపు పది లక్షల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు.

 

View this post on Instagram

 

@iamsrk

A post shared by Chulbul Pandey (@beingsalmankhan) on

Related posts