telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

సంగపట్నం ఆత్మహత్యల కేసులో టీడీపీ లీడర్ అరెస్ట్…

TDP-flag

తన మాట విననందుకు, గ్రామ బహిష్కరణ చేపిస్తానంటు, బెదిరించి వేధింపులకు గురి చేయడంతో, భయాందోళన చెందిన ఓ జంట ఉరి వేసుకొని , ఊపిరి తీసుకున్నారు, దంపతుల జంట ఆత్మహత్యల కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న ఆ నేత,  ప్రస్తుతం కటకటాలపాలయ్యాడు. కర్నూలు జిల్లా లో సంచలనం రేకెత్తించిన ఈ ఘటన అవుకు మండలం. సంగపట్నం గ్రామం లో జరిగింది, గ్రామానికి చెందిన ఊసేన్ రెడ్డి (43) ఆదిలక్ష్మి(30) అనే ఇద్దరు దంపతులు గురువారం రాత్రి ఇంటి పై కప్పుకు చీర కొంగుతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ దంపతుల జంట ఆత్మహత్యల  కేసుకు సంబంధించి మృతుల  మరణ వాంగ్మూలం మేరకు, మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి బంధువు, మండల టిడిపి నేత ఐ వి పక్కి రెడ్డి, ప్రధాన ముద్దాయి గా, బోయ రాముడు , ఈశ్వరమ్మ, సూర్యనారాయణ, నారాయణ అనే  ఐదుగురి పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నారాయణ , ఈశ్వరమ్మ పరారీలో ఉన్నారు. మృతుడు రాసి పెట్టి ఉంచిన మరణ వాంగ్మూలం ,మేరకు నిందితులపై 284/2020.306 అండర్ సెక్షన్ 34 ఐపీసీ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఇక తాజాగా ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న ఐ వి పక్కి రెడ్డి, బోయ రాముడు , సూర్యనారాయణ లను రామాపురం లో పోలీసులు అరెస్టు చేశారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. నిందితులను బనగాన పల్లె కోర్టు లో హాజరు పరచి రిమాండ్ కు తరలించినట్లు డోన్ డిఎస్పీ నరసింహారెడ్డి వెల్లడించారు.

Related posts