తిరుమల శ్రీవారి లడ్డూ విక్రయంపై టీటీడీ తీసుకున్న తాజా నిర్ణయంతో విమర్శలు వెల్లువిరుస్తున్నాయి. పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డూను ప్రతి చోట విక్రయిస్తామని చెప్పటం అభ్యంతరాలకు తావు ఇస్తుంది. తాజాగా ఈ విషయంపై టీడీపీ నేత దేవినేని ఉమ ట్విట్టర్ లో ఘాటుగా స్పందించారు.
‘‘భక్తులు మహాప్రసాదంగా భావించే తిరుపతి లడ్డూను మార్కెట్లో పెడతారా?. భక్తులు, దాతల మనోభావాలు దెబ్బతీసే హక్కు మీకు.. మీ బాబాయ్‌కి ఎవరిచ్చారు?. నిర్ణయాలను వెంటనే ప్రభుత్వం వెనక్కితీసుకోవాలి’’ అని డిమాండ్ చేశారు. నాడు ఏడుకొండలెందుకు రెండుకొండలు చాలన్నారు…నేడు కలియుగదైవం వెంకన్న భూములు వేలానికా? అని దేవినేని ప్రశ్నించారు.
కేసీఆర్ దుష్టపాలన నుంచి ప్రజలకు విముక్తి కలిగిస్తాం: రేవంత్ రెడ్డి