telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

ఆస్ట్రేలియాలో హైస్పీడ్ ఇంటర్నెట్..సెకనుకు 44.2 టీబీ వేగం!

Internet speed Australia

ఇంటర్నెట్ స్పీడ్ లో ఆస్ట్రేలియా సరికొత్త రికార్డు సృష్టించింది. సెకను వ్యవధిలో 1000 హై డెఫినిషన్ చిత్రాలను డౌన్ లోడ్ చేసుకునేంత వేగాన్ని వారు సాధించారు. సెకనుకు 44.2 టెరాబైట్ల వేగాన్ని చూపించారు. మోనాష్, స్విన్ బర్న్, ఆర్ఎంఐటీ యూనివర్శిటీల రీసెర్చర్లు సంయుక్తంగా ఈ రికార్డును నమోదు చేశాయి. ఈ టీమ్ కు డాక్టర్ బిల్ కోర్కోరన్, అర్మన్ మిచెల్, డేవిడ్ మాస్ లు నేతృత్వం వహించారు.

ఇంటర్నెట్ స్పీడ్ ను పరిశీలించేందుకు మెల్ బోర్న్ నగరంలో 76.6 కిలోమీటర్ల డార్క్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ ను ఇన్ స్టాల్ చేశారు. ఏక కాంతిపుంజం ద్వారా 44.2 టీబీపీఎస్ వేగాన్ని వీరు రికార్డు చేశారు. నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్ లో వీరి పరిశోధనల వివరాలు ప్రచురితం అయ్యాయి. డేటా ఆప్టిక్స్, టెలి కమ్యూనికేషన్స్ రంగాల్లో విప్లవాత్మక మార్పును తీసుకువచ్చేలా రీసెర్చర్ల ప్రయోగాలు ఫలితాలనిచ్చాయని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇంటర్నెట్ వేగాన్ని పెంచడం కోసం ‘మైక్రో-కోంబ్’ పేరిట ఓ పరికరాన్ని అభివృద్ధి చేశారు.

Related posts