telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

శ్రీరామనవమి మహోత్సవాలకు ఆన్‌లైన్‌లో టికెట్లు

badrachalam srirama as jaganmohini

తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలంలో ఏప్రిల్‌ 2,3 తేదీల్లో జరిగే శ్రీరామనవమి మహోత్సవాలకు ఆన్‌లైన్‌లో టిక్కెట్‌ విక్రయాలు ప్రారంభమయ్యాయి. భక్తులు టిక్కెట్లను www.bhadrachalamonline.com వెబ్‌సైట్‌ ద్వారా పొందవచ్చు. భధ్రాచలంలో మార్చి 25 నుంచి ఏప్రిల్‌ 8వ తేదీ వరకు జరుగనున్న శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు జరుగుతాయన్నారు.

2వ తేదీన స్వామివారి తిరు కల్యాణ మహోత్సవం, 3న స్వామివారి మహాపట్టాభిషేకం వీక్షించేందుకు రూ.5 వేలు, రూ.2 వేలు, రూ.1116, రూ.500, రూ.200, రూ.100 విలువతో సెక్టార్‌ టిక్కెట్లు ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నామన్నారు. ఇతర వివరాలకు 08743-232428 నంబర్‌కు సంప్రదించాలని సూచించారు.

Related posts