telugu navyamedia
ట్రెండింగ్ సాంకేతిక సామాజిక

దేశంలో 43 శాతం మంది టెక్‌ ఉద్యోగులుకు ఆరోగ్య సమస్యలు.. షాకింగ్ నివేదిక..

ప్రస్తుతం దేశంలో ఉరుకుల పరుగుల కూడిన జీవితాలు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావానికి గురిచేస్తున్నాయి. ముఖ్యంగా టెక్‌ ఇండస్ట్రీలోని ఉద్యోగులు ఎక్కువుగా ఆరోగ్యం సమస్యలు ఎదుర్కొంటున్నారు.

ఇటీవల భారతదేశంలోని ప్రముఖ ఎంప్లాయీ హెల్త్‌కేర్ బెనిఫిట్స్ ప్లాట్‌ఫారమ్ ఆన్‌ష్యూరిటీ (Onsurity) నిర్వహించిన ఒక అధ్యయనం, ఈ విషయాలను ధ్రువీకరించింది.

దేశంలోని టెక్ నిపుణులు ఎదుర్కొంటున్న ఆరోగ్య సస్యలను ‘బరీయింగ్ ది బర్నౌట్: డీకోడింగ్ ది హెల్త్ ఛాలెంజెస్ ఆఫ్ ఇండియాస్ టెక్ జీనియస్(Decoding the Health Challenges of India’s Tech Genius)’ పేరిట ఫలితాలు వెల్లడించింది.

ఈ అధ్యయనం ప్రధానంగా వర్క్‌ షెడ్యూల్స్‌ డిమాండింగ్‌ వల్ల ఉత్పన్నమయ్యే శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలపై దృష్టి సారించింది.

* సుదీర్ఘ పని గంటలు

దేశంలోని టెక్‌ ప్రొఫెషనల్స్‌లో దాదాపు 43% మంది, ఎక్కువ పని గంటల కారణంగా ప్రధాన ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారని అధ్యయనం వెల్లడించింది. ఈ ప్రొఫెషనల్స్‌లో 50% కంటే ఎక్కువ మంది వారానికి సగటున 52.5 గంటలు పని చేస్తున్నారు.

అంటే వీరు నేషనల్‌ యావరేజ్‌ వర్కింగ్‌ అవర్స్‌ 47.7 గంటలను అధిగమించారు. ఈ కనికరంలేని వర్క్‌ కల్చర్‌ అసిడిటీ, గట్ సమస్యలు, వెన్ను, మెడ నొప్పి, నిద్రలేమి, మజిల్‌ స్టిఫ్‌నెస్‌, కంటి చూపు సంబంధిత సమస్యలు, బరువు పెరగడం, తీవ్రమైన తలనొప్పి వంటి అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తోంది.

* నిద్ర లేకపోవడం, దాని పరిణామాలు

అస్థిరమైన వర్క్‌ షెడ్యూల్‌లతో, 26% మంది టెక్‌ ప్రొఫెషనల్స్‌ సక్రమంగా లేని నిద్రతో ఇబ్బందులు పడుతున్నారు. 51% మంది రోజుకు సగటున 5.5-6 గంటల సేపు మాత్రమే నిద్ర పోతున్నారని అధ్యయనం పేర్కొంది.

తగినంత నిద్ర లేకపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులు, రక్తపోటు, ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

* వ్యక్తిగత జీవితంలో త్యాగాలు

ఆందోళనకర స్థాయిలో 74 శాతం టెక్‌ ప్రొఫెషనల్స్‌ వర్క్‌ డిమాండ్ల కారణంగా ఫ్యామిలీ ఈవెంట్లు, వేడుకలకు హాజరు కావడం లేదని అధ్యయనంలో తేలింది.

ఇలా వర్క్‌లో తీరికలేని కారణంగా చాలా మంది పర్సనల్ లైఫ్‌ శాక్రిఫైజ్‌ చేయాల్సి వస్తున్నట్లు అంగీకరించారు. పని సంబంధిత ఒత్తిడి వారి వ్యక్తిగత జీవితాలపై పడుతుంది. వారి సంబంధాలు, శ్రేయస్సును ప్రభావితం చేస్తుంది.

* తక్షణ చర్యలు అవసరం

ఈ తీవ్రమైన ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి కంపెనీలు చర్యలు తీసుకోవాల్సిన తక్షణ అవసరాన్ని నిపుణులు నొక్కి చెప్పారు.

బర్న్‌అవుట్‌తో సంబంధం ఉన్న రిస్కులను తగ్గించడానికి సపోర్టివ్‌ వర్క్‌ ఎన్విరాన్‌మెంట్స్‌ క్రియేట్‌ చేయాలని, ఆరోగ్యకరమైన వర్క్‌-లైఫ్‌ బ్యాలెన్స్‌ని ప్రోత్సహించాలని తెలిపారు.

Related posts