telugu navyamedia
రాజకీయ

న్యూక్లియర్ బాంబుల గురించి చర్చిస్తున్న పాకిస్తాన్ 

Modi Imran Khan
పాకిస్తాన్ యుద్ధ సన్నాహాలు చేసుకుంటుందని , ఇప్పటికే యుద్ధ ట్యాంకు లను , విమానాలను నియంత్రణ  రేఖ దగ్గరకు తరలిస్తుందనే వార్త తో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది . ఈరోజు పాకిస్తాన్ ప్రధాన మంత్రి  ఇమ్రాన్ ఖాన్ దేశ  అత్యున్నత  నిర్ణయాత్మక  కమిటీ తో సమావేశమయ్యారు . 
నేషనల్ కమాండ్ అథారిటీ తో పాక్ ప్రధాని సమావేశమై  న్యూక్లియర్ బాంబుల గురించి  చర్చించినట్టు వార్తలు వెలువడ్డాయి . అంతకు ముందే పాకిస్తాన్ లోని విమానాశ్రయాలన్నింటినీ మూసివేయించింది . విమాన సర్వీసులన్నీ  రద్దుచేసింది . తమ దేశ  గగన తలం నుంచి ప్రయాణించే అన్ని విమానాలకు అనుమతి ఉండదని ప్రకటించింది . త్రివిధ దళాల అధిపతులు , దేశ అత్యున్నత భద్రతా సలహాదారులతో ప్రధాని సమావేశమయ్యారు . 
ఈ వార్త ఇప్పుడు  మన దేశంలో టెన్షన్ పుట్టిస్తుంది .  యుద్ధ   మేఘాలు కమ్ముకుంటున్నాయా అనిపిస్తోంది . భారత దేశ సరిహద్దు గ్రామాలను ఖాళి చేయిస్తున్నారు . సైనికులు అప్రమత్తంగా వున్నారు . పాకిస్తాన్ యుద్ధ విమానం భారత భూభాగంలోకి వస్తున్నా సమయంలో దాన్ని మన సైనికులు గాల్లోనే పేల్చివేశారు . భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు న్యూఢిల్లీ విజ్ఞాన్ భవన్ లో జరుగుతున్న నేషనల్ యూత్ ఫెస్టివల్ సమావేశానికి హాజరయ్యారు .
యువతీ యువకుల నుద్దేశించి ప్రసంగిస్తుండగా ఒక అధికారి వచ్చి ప్రధానికి ఒక చిన్న స్లిప్ అందించాడు . అది చదువుతున్న ప్రధాని నరేంద్ర మోడీ అర్దాంతరంగా తన ప్రసంగాన్ని ముగించి , వేదిక మీద నుంచి యువతీ యువకులకు చేయి ఊపుతూ  వడివడిగా వెళ్ళిపోయాడు .ఈ సంఘటన బట్టి చుస్తే పరిస్థితి చాలా సీరియస్ గా ఉందని అర్ధమవుతుంది . ప్రధాని తన కార్యాలనానికి వచ్చి అత్యున్నత అధికారులతో సమావేశమయ్యారు . 
ఇదిలా ఉండగా మన పొరుగు దేశమైన చైనాకు సుస్మా స్వరాజ్ వెళ్ళింది. పుల్వామా సంఘటన  మంగళవారం ఉగ్ర స్థావరాలపై జరిగిన దాడిని వివరించింది . ఈరోజు భారత్ , చైనా , రష్యా దేశాలు సంయుక్తంగా ఉగ్రవాదంపై ఒక ప్రకటన విడుదల చేశాయి . అయితే ఈ ప్రకటనలో పాకిస్తాన్ పేరు ప్రస్తావించలేదు . ప్రస్తుతం పాకిస్థాన్లోని ఇస్లామాబాద్ లోను , ఢిల్లీలోనూ వ్యూహ రచన జరుగుతుంది . 

Related posts