మధ్యప్రదేశ్‌లో రైల్వే పట్టాలపై ఒక వ్యక్తి పడి ఉన్నాడు. అతని పేరు ధర్మేంద్ర. దాన్ని గమనించిన ఒక రైల్లోని డ్రైవర్ పోలీసులకు సమాచారమిచ్చాడు. పోలీసులు వచ్చేలోగా అదే పట్టాలపై నుంచి మూడు రైళ్లు వెళ్లాయి. పోలీసులొచ్చేసరికి అతను లేవడం, ‘నాన్న వచ్చాడు…’ అంటూ ధర్మేంద్ర అనడంతో వాళ్లు నిశ్చేష్టులయ్యారు. చనిపోయాడని భావించిన వ్యక్తి నిద్రలో మెలకువ వచ్చినట్లుగా లేచిరావడం వారిని మరింత ఆశ్చర్యానికి గురిచేసింది. అతను బాగా తాగి ఉన్నాడని పోలీసులు గుర్తించారు. తాగిన మైకంలో ఒళ్లు తెలియకుండా పట్టాలపై పడున్న ధర్మేంద్రపై మూడు రైళ్లు దూసుకెళ్లినా చెక్కు చెదరకుండా ఉండడం నమ్మాల్సిన నిజం.
previous post
అందుకే ఆర్ఆర్ఆర్ కోసం ఆ హీరోను తీసుకున్నా… రాజమౌళి