telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

అందుకే నేను హైదరాబాద్ వచ్చాను అంటున్న యోగి ఆదిత్యనాద్…

గ్రేటర్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అయితే ఈరోజు ఎన్నికలో బీజేపీ కోసం ప్రచారం చేసేందుకు యోగి ఆదిత్యనాద్ హైదరాబాద్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన మల్కాజ్ గిరి, కూకట్ పల్లి నియోజకవర్గాల్లో రోడ్ షో నిర్వహించగా లాల్ దర్వాజలో బహిరంగ సభలో మాట్లాడారు. హైదరాబాద్ నగరాన్ని భాగ్యనగరం గా మార్చేందుకు మీ అందరితో కలిసి నడిచేందుకు వచ్చానని ఆయన అన్నారు. నిజాం ఈ ప్రాంతాన్ని పాకిస్థాన్ లో కలపాలని చూసాడు.. ఇక్కడి ప్రజలు వ్యతిరేకంగా పోరాడారు.. వారికి మద్దతుగా సర్దార్ పటేల్ నిలిచాడు.. భారత దేశంలో విలీనం చేశారని అన్నారు. ఇప్పటికే కొంతమంది నిజాం వారసులు అభివృద్ధికి ఆటంకం కలిగిస్తూ అరాచకాలు చేస్తున్నారు.. వారికి ఈ జి.హెచ్ యం సి ఎన్నికల ద్వారా బుద్ధి చెప్పాలని అన్నారు. అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి ఎన్నో ఆటంకాలు కల్పించారు.. ఇక్కడి ప్రజలు చాలా మంది రామాలయం నిర్మాణానికి ముందుకు వచ్చారని, మోడీ రామ మందిరం నిర్మాణం కోసం భూమి పూజ చేసిన ఘనత దక్కించుకున్నారని అన్నారు. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన పేదలకు తెరాస అందించడం లేదన్న ఆయన యూపీలో మూడు ఏళ్ల లో ముప్పై లక్షల మందికి ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన ద్వారా ఇల్లు అందించాము, టీఆర్ఎస్ ఆరు ఏళ్ళలో ఎంతమందికి ఇండ్లు ఇచ్చింది ? అని ఆయన ప్రశ్నించారు. ప్రధాన్ మంత్రి పేద రైతులకు ఆరువేల రూపాయలు అకౌంట్లో జమచేస్తుండగా.. వరద సహాయాన్ని అర్హులకు టీఆర్ఎస్ అకౌంట్ ల ద్వార ఎందుకు ఇవ్వలేదు అని కెసిఆర్ ని ప్రశ్నిస్తున్నానని అన్నారు. నిజాం రూపంలో ఒక కుటుంబం హైదరాబాద్ ,తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకోవాలని చూస్తున్నారు, దానిని సాకరం కాకుండా‌ చూడాలని అన్నారు.

Related posts