telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కన్నడ నటి ఆత్మహత్య… ప్రియుడు అరెస్ట్

Chandana

కన్నడ టీవీ నటి చందన ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆత్మహత్యకు ముందు పురుగుల మందు తాగుతూ సెల్ఫీ వీడియో తీసుకున్న చందన.. ప్రియుడు దినేశ్‌ తనను మోసం చేశాడని, తన డబ్బులు వాడుకున్నాడని ఆరోపించింది. తాజాగా ఈ కేసులో ఆమె ప్రియుడు దినేష్ ను పోలీసులు అరెస్ట్ చేసారు. సూసైడ్ కి ముందు చందన తీసుకున్న సెల్ఫీ వీడియో ఆధారంగా పోలీసులు దినేష్ ను అరెస్ట్ చేసారు. చందన ఆత్మహత్య తరవాత దినేష్ పరార్ అయ్యాడు. దాంతో కూతురు ఆత్మహత్య తరవాత ఆమె తల్లి తండ్రులు దినేష్ పై కేసు నమోదు చేసారు.

Related posts