telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నాగార్జునతో రొమాన్స్ చేయనున్న పాయల్ !

కింగ్ అక్కినేని నాగార్జున సూపర్ హిట్ సినిమా ‘సోగ్గాడే చిన్నినాయన’ చిత్రంలో బంగార్రాజు పాత్ర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. దీంతో “బంగార్రాజు” అనే టైటిల్ తో డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ ఈ సినిమాకి సీక్వెల్ తీయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి కూడా ఓ పాత్రలో నటిస్తుండగా… సమంత కూడా సెకెండ్ హాఫ్ లో వచ్చే కీలక పాత్రలో నటించబోతోందని ఇప్పటికే ఆమెకు దర్శకుడు కళ్యాణ్ కృష్ణ, కథ కూడా వినిపించాడని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో రమ్యకృష్ణ కూడా నటించబోతుంది. ఇది ఇలా ఉండగా.. తాజాగా మరో వార్త వైరల్ అవుతోంది. `సొగ్గాడే చిన్నినాయనా`లో అన‌సూయ‌తో అద‌రిపోయే స్టెప్పులేయించిన క‌ళ్యాణ్ కృష్ణ ఈ సీక్వెల్ లో పాయ‌ల్ రాజ్ పుత్ తో ఐట‌మ్ సాంగ్ చేయించ‌బోతున్నాడ‌ని తెలుస్తోంది. `ఆర్ ఎక్స్ 100`తో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినా…. ఐట‌మ్ సాంగ్స్ చేయ‌డానికి సైతం పాయ‌ల్ సై అంటోంది. అందుకు ఉదాహ‌ర‌ణ‌గా తేజ డైరెక్ట్ చేసిన `సీత‌` మూవీనే చెప్పుకోవ‌చ్చు. అలానే పాత్ర‌ల‌కు పెద్దంత ప్రాధాన్యం లేక‌పోయినా… ఒక‌టి రెండు పాట‌ల‌తో సాగే పాత్రయినా… అది స్టార్ హీరో మూవీ అయితే చాలు పాయ‌ల్ ఓకే చేస్తోంది. సో… ఆ ర‌కంగా `బంగార్రాజు`లో అవ‌కాశం ద‌క్కాలే కానీ పాట‌కైనా పాయ‌ల్ గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తుంద‌ని అంటున్నారు.

Related posts