telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

ఢిల్లీ బాటలోనే మిగితా రాష్ట్రాలు వెళ్లనున్నాయా…?

ప్రస్తుతం కరోనా కేసులు మన దేశంలో 84 లక్షలకు పైగా ఉన్నాయి.  5 లక్షలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి.  ప్రస్తుతం దేశంలో చలి పంజా విసురుతోంది.  చలి తీవ్రత పెరిగిపోతుండటంతో కేసులు పెరిగే అవకాశం ఉన్నట్టు నిపుణులు హెచ్చరిస్తున్నారు.  దీనికి తోడు ఢిల్లీలో వాయుకాలుష్యం పెరిగిపోతున్నది.  దీని నుంచి బయటపడాలి అంటే తప్పనిసరిగా కాలుష్యాన్ని తగ్గించే మార్గాలు అన్వేషించాలి.  ఇక దేశంలో అతి ముఖ్యమైన, పెద్దవైన పండగల్లో దీపావళి కూడా ఒకటి.  దీపావళికి దేశంలో టపాసులు కాలుస్తుంటారు.  దీని వలన కాలుష్యం పెరిగిపోతుంది.  గాలిలో కాలుష్యం పెరిగితే, కరోనా వ్యాప్తి పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే దీపావళి టపాసులపై ఆంక్షలు విధించింది.  ఢిల్లీ పరిధిలో టపాసులు కల్చరాదని తేల్చి చెప్పింది.  ఆ బాటలోనే రాజస్తాన్, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాలు కూడా నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పుడు  అటుహరియాణాలో కూడా టపాసులు అమ్మకూడదని తేల్చి చెప్పింది.  దేశంలోని అన్ని రాష్ట్రాలు ఇదే విధమైన నిర్ణయం తీసుకుంటే కాలుష్యం నుంచి కొంతమేర బయటపడొచ్చు.  ఈ ఏడాది దీపావళి చేసుకోకపోతే వచ్చే ఏడాది ఘనంగా చేసుకోవచ్చని కాలుష్యం నుంచి బయటపడితే కరోనా వ్యాప్తి తగ్గుతుందని నిపుణులు అంటున్నారు.

Related posts