telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

అటవీ సిబ్బందిపై దాడి ఘటన..పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు!

అసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ మండలం లోని సార్సాలాలో అటవీశాఖ సిబ్బందిపై దాడి ఘటన తెలంగాణలో చర్హనీయాంశమైంది. ఇప్పటికే ఈ దాడిని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తో పాటు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ ఖండించారు. మరో వైపు ఎమ్మెల్యే కొనప్ప తన తమ్ముడు అటవీ సిబ్బందిపై ఎలాంటి దాడి చేయలేదని సమర్థించుకున్నారు.

ఈ నేపథ్యంలో పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. కాగజ్ నగర్ డీఎస్పీ సాంబయ్య, రూరల్ సీఐ వెంకటేశ్ ను సస్పెండ్ చేస్తూ వరంగల్ రేంజ్ ఐజీ నాగిరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ దాడి జరిగిన సమయంలో డీఎస్పీ, సీఐలు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపిస్తూ వారిపై చర్యలు తీసుకున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అనుచరులు అటవీ శాఖ అధికారిణిపైనే కాకుండా తమ పైనా విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారని ఫారెస్ట్ సిబ్బంది ఆరోపించారు.

Related posts