telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

బీజేపీవైపు చూస్తున్న … కడియం.. పక్కన పెట్టినందుకే… !

Kadiyam Srihari Fires On Congress

తెలుగు రాష్ట్రాలపై బీజేపీ వ్యూహాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆయా పార్టీలలో నిరుత్సహాంగా ఉన్న నేతలను వలపట్టి మరీ తమ వైపు తిప్పుకుంటున్నారు. వివిధ కారణాల చేత తెరాస లో కూడా అగ్రనేతలు పక్కన పెట్టబడ్డారు. దానితో వారు పార్టీ పట్ల నిరుత్సహాంగా ఉండటం గమనించిన బీజేపీ తమ ప్రయత్నాలు తాము చేసుకుంటున్నారు. తాజాగా, టీఆర్ఎస్‌లో భవిష్యత్తు లేని వారు, పదవులు లేని వారు, అణగదొక్కపడుతున్న నాయకులు ఇప్పుడు బీజేపీలో చేరేందుకు రెడీ అవుతున్నారు. టీఆర్ఎస్ ద్వితీయ శ్రేణి నాయకుల్లో చాలా మంది బీజేపీలో భవిష్యత్తు వెతుక్కుంటున్నారు. కీలక నేతలు సైతం కాషాయం వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. కేసీఆర్ తొలి కేబినెట్ ఏర్పడ్డాక వరంగల్ ఎంపీగా ఉన్న ఆయన్ను మంత్రిని చేసి.. విద్యాశాఖ ఇవ్వడంతో పాటు డిప్యూటీ సీఎం పదవి కూడా ఇచ్చారు. ఆ తర్వాత ఆయన ఎమ్మెల్సీ అయ్యారు.

తొలి కేబినెట్లో అంత కీలకంగా ఉన్న కడియంను ఇప్పుడు పక్కన పెట్టడంతో ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. పైగా తనకు రాజకీయ శత్రవుగా ఉన్న ఎర్రబెల్లికి మంత్రి పదవి ఇవ్వడంతో కడియం రగిలిపోతున్నారు. టీఆర్ ఎస్ లో తనపై తీవ్రమైన వివక్ష చూపుతున్నారని కూడా ఆయన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ఇక కడియం ఈ ఎన్నికల్లో తన కుమార్తె కావ్యకు స్టేషన్‌ఘన్‌పూర్ టిక్కెట్ ఇవ్వలేదు. కుమార్తె సీటు కోసం ఆయన ఎన్నో ప్రయత్నాలు చేసినా కేసీఆర్ వద్ద నిరాశే ఎదురైంది. కనీసం కూతురు కావ్యకు వరంగల్ లోక్ సభ సీటు ఇవ్వాలని కోరిన కేసీఆర్ పట్టించుకోలేదట. దానితో బీజేపీ స్వాగతించడం, ఆయన ఆలోచనలో పడటం..వరుసగా జరుగుతున్న పరిణామాలు!!

అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాల్లో ఆయన చురుగ్గా పాల్గోవడం లేదు. ఇటీవల ఘన్ పూర్ నియోజకవర్గంలోని అనుచరులతో రహస్యంగా భేటి అయినట్టు విశ్వసనీయ సమాచారం. స్థానిక ఎన్నికల్లోనూ కడియం అనుచరులకు సీట్లు ఇవ్వకపోవడం కూడా ఆయన పార్టీ వీడాలన్న నిర్ణయానికి మరో కారణంగా తెలుస్తోంది. ఏదేమైనా కడియం బీజేపీలోకి వెళితే ఆయనకు మంచి ప్రాధాన్యత దక్కే ఛాన్స్ ఉంది.

Related posts