telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అనిరుధ్ ని ముద్దు పెట్టుకున్నది నిజమే… కానీ అది తప్పు : హీరోయిన్

Andrea

కోలీవుడ్ హీరోయిన్ ఆండ్రియా సంగీత దర్శకుడు అనిరుధ్ ప్రేమ వ్యవహారం అప్పట్లో సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. అప్పట్లో అనిరుద్ తో ఆండ్రియా లిప్ లాక్ విషయం కోలీవుడ్ లో సంచలనం అయ్యింది. అయితే దీనిపై ఆండ్రియా కానీ అనిరుధ్ కానీ ఎప్పుడు స్పందించలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ లిప్ లాక్ విషయమై ఆండ్రియా మాట్లాడుతూ… “అనిరుధ్ ని ముద్దు పెట్టుకున్నది నిజమే. ఆ ఫోటోల్లో నిజం ఉంది. అయితే అదేమీ తప్పు కాదు. అప్పట్లో మేం ప్రేమలో ఉన్నాం. అలాంటప్పుడు ఇవన్నీ సహజమే. కానీ వాటిని సీక్రెట్ గా ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యడం తప్పు. ఇలా జరిగినందుకు అనిరుథ్ కూడా నాకు క్షమాపణలు చెప్పాడు” అంటూ చెప్పుకొచ్చింది. ఇక బోల్డ్ బ్యూటీ నటి మాత్రమే కాదు సూపర్ సింగర్, బెస్ట్ లిరిక్ రైటర్, గుడ్ కంపోజర్… ఇలా ఆమెకు చాలా టాలెంట్ ఉంది. అందుకే సినీ పరిశ్రమలో మల్టిపుల్ టాలెంటెడ్ యాక్ట్రెస్‌గా నిలదొక్కుకుంది. గత ఏడాది ‘విశ్వరూపం 2’, ‘వడ చెన్నై’ సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించుకుంది.

Related posts