telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కిక్ బాక్సర్ కు విజయ్ దేవరకొండ ఆర్థిక సాయం… ఇప్పుడు గోల్డ్ మెడల్…!

Vijay-Devarakonda

మెదక్ జిల్లాకు చెందిన కిక్ బాక్సర్ గణేష్ ఎంబారి న్యూఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ కిక్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్‌‌లో పోటీపడాలని నిర్ణయించుకున్నాడు. కానీ పేద కుటుంబానికి చెందిన గణేష్‌ది మ్యాచ్ ఫీజు చెల్లించలేని పరిస్థితి.ఫ్యాన్స్ ద్వారా విషయం తెలుసుకున్న హీరో విజయ్ తమ ‘‘దేవరకొండ ఫౌండేషన్’’ నుండి ఆ పార్టిసిపేషన్ ఫీజ్ రూ. 24 వేలు ఆర్థిక సహాయం చేశారు. ఫిబ్రవరి 1న ఆ చెక్‌ను దేవరకొండ గోవర్ధన్ రావు క్రీడాకారుడు గణేష్‌కు అందజేశారు. ఆ సహాయంతో న్యూడిల్లీ వెళ్లిన గణేష్ ఈ నెల 13న జరిగిన పోటీలో పాల్గొని గోల్డ్ మెడల్ సాధించాడు. యంగ్ టాలెంట్‌ను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుండే హీరో విజయ్ చేసిన ఆ సహాయం వల్లే తాను ఆ పోటీల్లో పార్టిసిపేట్ చేయగలిగి, గోల్డ్ మెడల్ సాధించానని గణేష్ ఎంబారి సంతోషం వ్యక్తం చేశాడు., విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. డిఫరెంట్ లవ్‌ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ సరసన నలుగురు హీరోయిన్లు నటించారు. అయితే, బొగ్గు గనిలో కార్మికుడిగా విజయ్ చేసిన సీనయ్య పాత్ర సినిమాలో హైలైట్‌గా నిలిచింది.

Related posts