telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కాజల్ కు అందుకే సినిమాలు తగ్గాయట…!

Kajal

చందమామ కాజల్ అగర్వాల్ తెలుగు చిత్రపరిశ్రమలో దశాబ్దానికి పైగా అగ్ర కథానాయికగా వెలుగొందింది. పలు భాషల్లో సినిమాలు చేస్తున్నప్పటికీ ఆమెకు విజయాలు దక్కడం లేదు. ప్రస్తుతం ఈమె కమల్ హాసన్ `భారతీయుడు 2`లో 85 ఏళ్ల ముసలమ్మ పాత్రలో నటిస్తోంది. అలాగే బాలీవుడ్‌లో ‘ముంబాయి సాగా’ సినిమా చేస్తోంది. ఇవి తప్ప కాజల్ చేతిలో మరో ఆఫర్ లేదు. పారితోషికం తగ్గించుకోవడానికి సిద్ధపడినప్పటికీ అవకాశాలు రావడం లేదు. ప్రస్తుతం తన కెరీర్ గురించి తాజాగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కాజల్ మాట్లాడింది. “ప్రస్తుతం నేను నటిగా చాలా పరిణితి చెందాను. రిస్క్ తీసుకోవడానికి భయపడను. ప్రయోగాత్మక చిత్రాలు చేయడానికి సిద్ధమే. నా పాత్ర బాగుంటే కొత్తవాళ్లతో జత కట్టడానికి కూడా రెడీ. ఇప్పటివరకు నేను రెస్ట్ లేకుండా సినిమాలు చేశాను. ఇప్పుడు విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాను. అందుకే సినిమాలు అంగీకరించడం లేదు. కొద్ది రోజులు విశ్రాంతి తీసుకున్నాక మళ్లీ సినిమాలు చేస్తాను” అంటూ చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ.

Related posts