telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

వాళ్ళు తిట్టకపోతే అసలు విషయం తెలిసేదే కాదు… : అవికా గోర్

Avika-Gor

‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది నటి అవికా గోర్. ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో అవికా గోర్ టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ సినిమా తరువాత పలు సినిమాల్లో నటించి మెప్పించింది. ఇటీవల ‘రాజుగారి గది 3’లో హీరోయిన్‌గా నటించింది. చాలా గ్యాప్‌ తరువాత తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆమె బరువు తగ్గి బాగా స్లిమ్‌గా తయారైంది. అయితే దీనికి ప్రత్యేకమైన కారణమే ఉందట. ఈ విషయాన్నే అవికా ప్రస్తావిస్తూ “నిజమే ఆ మధ్య బరువు బాగా పెరిగాను. దానికి కారణం నా బద్ధకమే. కానీ ఓ కార్యక్రమానికి స్కర్టు వేసుకుని వెళ్ళాను. ఆ డ్రస్‌లో నన్ను చూసి చాలా మంది తిట్టారు. దానికి కారణం నేను బాగా లావుగా ఉండడమే. అప్పుడే బరువు తగ్గాలని నిర్ణయించుకున్నాను. దాదాపు పన్నెండు కిలోల బరువు తగ్గాను. బరువు తగ్గిన తర్వాత నాపై నాకు నమ్మకం పెరిగింది. ఈ విషయంలో ట్రోలింగ్ నాకు బాగా హెల్ప్ అయింది. నా బరువుపై వచ్చిన ట్రోలింగ్స్‌ను నేను సవాల్‌గా తీసుకున్నాను. తగ్గి చూపించాలనుకున్నాను. బరువు తగ్గాను. అలా ట్రోలింగ్ నాకు స్ఫూర్తిగా నిలిచింది. వాళ్లు తిట్టకపోతే నేను లావెక్కిన విషయం నాకు తెలిసేది కాదు…” అని చెప్పుకొచ్చింది.

Related posts