telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సుశాంత్ ఆత్మహత్య : ట్రోల్స్ పై అలియా భట్ తల్లి రియాక్షన్

Alia

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య అందరికీ షాకిచ్చింది. సుశాంత్ మృతికి బాలీవుడ్‌లోని బంధుప్రీతే కారణమని నెటిజన్స్ భగ్గుమంటున్నారు. ఈ క్రమంలో కరణ్ జోహర్, కపూర్, ఖాన్ ఫ్యామిలీను నెటిజన్స్ టార్గెట్ చేస్తున్నారు.నెపోటిజం వల్లనే అలియా భట్ హీరోయిన్ అయిందని సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎక్కువ అవుతున్న నేపథ్యంలో అలియా తల్లి సీనియర్ నటి సోనీ రజ్దాన్ స్పందించారు. “ఫలానా వారి కొడుకు లేదా కుమార్తె అంటే ప్రేక్షకులకు వారి మీద అంచనాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రోజు నెపోటిజం గురించి రెచ్చగొట్టే కామెంట్స్ చేస్తున్న వారు ఏదొక రోజు తమ వారసుల గురించి కూడా మాట్లాడాల్సి వస్తుంది. తమ పిల్లలు ఇండస్ట్రీలోకి వస్తామంటే.. ఏం చేస్తారు.. వారిని ఆపగలుగుతారా..? ఇండస్ట్రీకి ఎంతమంది వచ్చినా ఆడియన్స్ రియల్ టాలెంట్ ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేని వ్యక్తిగా నాకు ఇది అందరి కంటే ఎక్కువగా తెలుసు” అని ట్వీట్ చేసింది.

Related posts