telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు

గుడ్ న్యూస్ : రేపు ఏపీకి రానున్న 5 లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులు

ఏపీ ప్రజలకు జగన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రేపు రాష్ట్రానికి 5 లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులు రానున్నాయి. పూణేలోని సీరం ఇనిస్టిట్యూట్ నుంచి శనివారం కొవిషీల్డ్ టీకా డోసులు చేరుకోనున్నాయి. తొలుత గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి పంపనున్నారు అధికారులు. అక్కడి నుంచి వైద్య, ఆరోగ్యశాఖ ఆదేశాలతో అన్ని జిల్లాలకు వ్యాక్సిన్ తరలింపు జరుగనుంది. రెండు రోజులుగా ఏపీలో కరోనా వ్యాక్సిన్ కొరత ఏర్పడింది. దీంతో కరోనా టీకా మహోత్సవం నిలిచింది. రేపు రాష్ట్రానికి 5 లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులు రానుండటంతో తిరిగి కరోనా కేంద్రాల్లో వ్యాక్సిన్ ను వేయటానికి యంత్రాంగం సిద్దమవుతున్నది. కాగా ఏపీలో కరోనా ఉధృతి పెరుగుతూ ఉంది. ఇప్పటికే ఏపీలో 9.37 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో ఏపీలో కొత్తగా 4,157 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 9,37,049 కు చేరింది. ఇందులో 901327 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా 28,383 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనా కారణంగా 18 మంది మృతి చెందారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో 7,339 మంది మృతి చెందారు. 

Related posts