telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు…

shashikala tamilnadu

నాలుగేళ్ల విరామం తర్వాత శశికళ తమిళనాడుకు చేరుకున్నారు. కారుకు అన్నా డీఎంకే జెండాలతో ఆమె తమిళనాడులోకి ఎంటరయ్యారు. శశికళలకు అడుగడుగున్నా ఘనస్వాగతం పలికారు అభిమానులు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నాలుగేళ్లు జైలు శిక్ష తర్వత జైలు నుంచి విడుదలయ్యారు శశికళ. గత నెల 27న పరప్పన అ్రగహారం జైలు నుంచి 66 ఏళ్ల శశికళ విడుదలైనా… కరోనా చికిత్స కారణంగా ఆమె బెంగళూరులోనే ఉన్నారు. ఇక, శశికళను తమిళనాడుకు ఆహ్వానిస్తూ చెన్నై సహా రాష్ట్ర వ్యాప్తంగా భారీ కటౌట్లు వెలశాయి. కొందరు శశికళను అన్నా డీఎంకే శాశ్వత ప్రధాన కార్యదర్శిగా పేర్కొంటే… ఇంకొన్ని పోస్టర్లలో రాజమాత అంటూ కీర్తించారు. అయితే, శశికళ నిర్వహించాలని భావిస్తున్న బహిరంగ సభకు అధికారులు అభ్యంతరం చెప్పే అవకాశం ఉంది. కరోనా ఆంక్షలను సాకుగా చూపి… భారీగా జన సమీకరణ చేయకుండా అధికారవర్గాలు అడ్డుకునే అవకాశం ఉంది.  తమిళనాడు రాజకీయాల్లో ఓ కుదుపు తీసుకురాబోతున్నారు శశికళ. ఆమె తెవర్‌ సామాజిక వర్గానికి చెందిన వారు. తమిళనాట అన్నా డీఎంకేకి తెవర్‌ సామాజిక వర్గం ఓటు బ్యాంక్‌గా ఉంది. వచ్చే మేలో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తన సత్తా ఏమిటో చూపించాలని భావిస్తున్నారు శశికళ.

Related posts