మన దేశ వ్యాప్తంగా ప్రచురము పొందిన వాటిలో కుంభమేళా కూడా ఒక్కటి. అయితే మాములుగా ఈ కుంభమేళాకు కోట్లాది మంది భక్తులు తరలివస్తారు. దేశంలోని నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా లక్షల మంది ఈ కుంభమేళాకు తరలివస్తుంటారు. ఇక ప్రస్తుతం కరోనా సమయంలో హరిద్వార్ లో జరుగుతున్న కుంభమేళాకు అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కరోనా మహమ్మారి కుంభమేళాలో వ్యాపిస్తోంది. ఇప్పటికే అనేకమంది కుంభమేళాకు వచ్చిన భక్తులు కరోనా బారిన పడ్డారు. దీంతో కర్ణాటక ప్రభుత్వం కుంభమేళాపై కీలక నిర్ణయం తీసుకుంది. కుంభమేళాకు వెళ్లి వచ్చే కర్ణాటకకు చెందిన భక్తులు తిరిగి వచ్చిన తరువాత తప్పనిసరిగా హోమ్ క్వారంటైన్ లో ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. పుణ్యస్నానాలు చేసిన భక్తులు తప్పనిసరిగా కరోనా టెస్టులు చేయించుకోవాలని స్పష్టం చేసింది. ఒక చేయాలి మరి మిగిత రాష్ట్రాలు కూడా ఈ విధమైన చర్యలు తీసుకుంటుందా… లేదా అనేది.
యురేనియం తవ్వకాలపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు