మాములుగా లంచం పుచ్చుకునే ధికారులు టేబుల్ కింది నుండి కానీ ఆఫీస్ బయట కానీ తీసుకుంటారు. కానీ ఓ మహిళా అధికారి ఏకంగా సీసీటీవీ కెమెరాకు చూపించి మరీ లంచం వసూలు చేసింది. వివరాల్లోకి వెళ్తే, శ్రీకాకుళం జిల్లా కర్మాగారాల తనిఖీ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ అయిన కుసుమ కుమారి అక్రమ వసూళ్లకు అలవాటు పడ్డట్లుగా తెలుస్తోంది. గతంలోనూ ఈమెపై లంచాలకు అలవాటు పడ్డ అధికారిగా పేరుంది. తాజాగా, ఓ కర్మాగారం తనిఖీల ధ్రువప్రత్రం కోసం అనుమతి ఇచ్చేందుకు యాజమాని వద్ద లంచం తీసుకుంది. అంతలోనే ఆమెకు ఆఫీసులో సీసీ కెమెరాలున్న సంగతి గుర్తుకు వచ్చినట్లుంది. సీసీ కెమెరాలు పనిచేయడం లేదన్న నమ్మకంతోనో లేక.. ఎవరు చూస్తారులే అనే ధీమాతోనో గాని.. కుసుమ కుమారి ఏకంగా సీసీ కెమెరాకే లంచం తీసుకున్న డబ్బు చూపిస్తూ హాయ్ చెప్పింది. అయితే ఈ సీసీటీవీ ఫుటేజ్ వ్యవహారం ఉన్నతాధికారుల వద్దకు చేరింది. దింతో కుసుమ కుమారిని సస్పెండ్ చేస్తూ కర్మాగారాల శాఖ డైరెక్టర్ చంద్రశేఖర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఈ లంచం వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
previous post
next post