telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ఏపీ మంత్రులు అరుస్తారు… కరుస్తారు

సీఎం జ‌గ‌న్ జగన్ కరోన కట్టడిలో విఫలం అయ్యారు.. భవనం వదిలి బయటకి రావాల‌ని డిమాండ్ చేశారు. ఇక‌, ఏపీ మంత్రులు డప్పులు కొట్టుకుంటున్నార‌ని ఎద్దేవా చేసారు పీసీసీ చీఫ్ శైల‌జానాథ్. ఏపీ మంత్రులు అరుస్తారు…కరుస్తారు.. అని మండిప‌డ్డారు.. మ‌రోవైపు.. ఎన్నికల సమయంలోనే కరోన ఎక్కువ పెరిగిపోయింద‌న్న శైల‌జానాథ్.. దేశానికి వ్యతిరేకంగా పనిచేసేవాళ్లు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం ఆర్ఎస్ఎస్‌ వాళ్లు మాత్ర‌మే.. దానికి అనుసంధానం అయిన బీజేపీ అన్నారు.. కానీ, సీఎం వైఎస్ జ‌గ‌న్‌.. బీజేపీని ఫాలోఅయితే లాభంలేద‌ని హిత‌వుప‌లికారు. ప్రజలు లాక్‌డౌన్ కి భయపడుతున్నారు… వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయాల‌ని కోరారు శైల‌జానాథ్.. సీఎం జగన్ పెంచి పోషిస్తున్న వాలంటైర్లు కూడా ఉన్నారు వాళ్ల‌ని వాడుకొని వ్యాక్సినేష‌న్ కొన‌సాగించాల‌న్నారు.. కోవిడ్ కి ఖర్చయ్యే మొత్తాన్ని తక్షణమే బిల్లుల మొత్తాన్ని ప్రభుత్వం భరించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంద‌న్న ఆయ‌న‌.. 3 నుండి 4 నెలలు  7500 నగదును ప్రతి ఒక్కరికి కేటాయించి.. నిత్యావసరాలు ఇంటికి పంపాల‌న్నారు.

Related posts