telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

వచ్చే ఏడాది ఫిబ్రవరి 16 నుండి మేడారం జాతర…

medaram jatara

ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం జాత‌ర‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హిస్తోంది తెలంగాణ ప్ర‌భుత్వం. అయితే వచ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రి 16 నుంచి 19వ తేదీ వ‌ర‌కు ఈ మ‌హాజాత‌ర‌ జరగనుంది. అయితే ఈ జాతరలో ఫిబ్రవరి 16న సారమ్మల, గోవిందరాజు, పగిడిద్ద రాజు గద్దెలకు చేరుకోనుండ‌గా.. 17న సమ్మక్క గద్దెకు చేరుకుంటారు.. 18న భక్తులు మొక్కులు సమర్పించుకోనుండ‌గా.. తిరిగి ఫిబ్రవరి 19న వనదేవతల వనప్రవేశం.. గోవిందరాజు, పగిడిద్దరాజులు వారి వారి స్వగ్రామాలకు వెళ్లడంతో మహాజాతర ముగుస్తుంద‌ని గిరిజ‌న పూజారాలు ప్ర‌క‌టించారు.  ఇక‌, కోట్లాది మందికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్ర‌భుత్వం ఏర్పాట్లు చేస్తూ వ‌స్తుంది.. స‌మీపంలోని జంప‌న్న‌వాగులో స్నానాలు చేసి.. స‌మ్మ‌క్క‌, సార‌ల‌మ్మ‌ల‌ను ద‌ర్శించుకుని భ‌క్తులు బంగారాన్ని స‌మ‌ర్పించుకుని మొక్క‌లు చెల్లించుకుంటారు. జాత‌ర స‌మ‌యంలోనే కాదు.. ఇప్పుడు ఎప్పుడైనా గ‌ద్దెల‌ను ద‌ర్శించుకునే వీలు ఉంటుంది. తెలుగు రాష్ట్రాల‌తో పాటు మ‌ధ్య‌ప్ర‌దేశ్, ఛ‌త్తీస్ గ‌ఢ్‌, ఒడిశా, మ‌హారాష్ట్ర, క‌ర్ణాట‌క‌.. ఇత‌ర రాష్ట్రాలు, దేశాల నుంచి కూడా గిరిజ‌నులు త‌ర‌లివ‌స్తారు.

Related posts