ముంబై వేదికగా ఈరోజు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మొదటి మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టులో ఓపెనర్ డుప్లెసిస్(50) అర్ధశతకంతో రాణించగా మ్యాచ్ చివరి ఓవర్ లో 36 పరుగులు బాదిన రవీంద్ర జడేజా 62 అర్ధశతకంతో అదరగొట్టాడు. దాంతో ధోనిసేన నిర్ణిత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. ఇక 192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగ్గిన బెంగళూరు జట్టుకు చెన్నై బౌలర్లు మొదట్లోనే షాక్ ఇచ్చారు. విరాట్ కోహ్లీని 8 పరుగులకే పెవిలియన్ చేర్చారు. కానీ మరో ఓపెనర్ దేవదత్ పాడికల్(34) , మాక్స్వెల్ (22) పరుగులతో కొంత భాగసౌమ్యని నెలకొల్పడంతో జట్టు లక్ష్యం వైపుకు సాగింది. కానీ వారు ఇద్దరు ఔట్ అయిన తర్వాత చెన్నై స్పిన్నర్ రవీంద్ర జడేజాతో పాటుగా మిగిత బౌలర్లు వరుస వికెట్లు తీయడంతో ఆ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 122 పరుగులే చేసింది. దాంతో చెన్నై 69 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ విజయంతో పాయింట్ల పట్టికలో చెన్నై మళ్ళీ మొదటి స్థానానికి వెళ్లగా ఈ పరాజయంతో ఐపీఎల్ 2021 లో మొదటి ఓటమిని తమ ఖాతాలో వేసుకుంది కోహ్లీసేన.
previous post
next post