పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ దేశ భద్రత విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావెద్ బాజ్వా పదవీకాలాన్ని పొడగించారు. మరో మూడేళ్ల పాటు ఆర్మీ చీఫ్ జనరల్ బాజ్వా పదవీకాలాన్ని పొడిగిస్తున్నట్లు పీఎంవో కార్యాలయంలో ఓ ప్రకటనలో పేర్కొన్నది. ప్రాంతీయ భద్రతా వాతవరణాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పీఎంవో వెల్లడించింది. పీఎంవో రిలీజైన్ చేసిన నొటిఫికేషన్‌పై ఇమ్రాన్ ఖాన్ సంతకం చేశారు. 2016 నవంబర్‌లో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రభుత్వ హయాంలో జనరల్ బాజ్వాను ఆర్మీ చీఫ్‌గా నియమించారు.
previous post
next post
సంయమనంతో మాట్లాడాలి.. బొత్సకు పవన్ హితవు