telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

బాదం పప్పులను నానబెట్టి తినాలి.. ఎందుకంటే ?

Almonds

రోజూ గుప్పెడు బాదం పప్పులను తినడం ఆరోగ్యానికి మంచిది. బాదం పప్పులను రాత్రి పూట నీటిలో నానబెట్టి ఉదయాన్నే తినడం వల్ల ప్రయోజనాలు ఎక్కువగా లభిస్తాయి. బాదం పప్పులను నీటిలో నానబెట్టడం వల్ల అవి మరింత రుచిగా ఉంటాయి. బాదం పప్పు మీద ఉండే తొక్కలో టానిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది శరీరం పోషకాలను పూర్తిస్థాయిలో శోషించుకోకుండా అడ్డుకుంటుంది. నాన బెట్టడం వల్ల దాని ప్రభావం తగ్గి పోషకాలు చక్కగా శరీరానికి చేరతాయి. బాదం పప్పులను నీటిలో నానబెట్టడం వల్ల ఈ తొక్క తేలిగ్గా వచ్చేస్తుంది. రోజూ బాదం పప్పు తింటే అందులోని అసంతృప్త కొవ్వులు ఆకలిని తగ్గిస్తాయి. కడుపు నిండిన భావన కలిగిస్తాయి. కాబట్టి.. ఆహారాన్ని ఎక్కువగా తీసుకోలేరు. ఫలితంగా ఎక్కువ కష్టపడకుండానే తేలిగ్గా బరువు తగ్గవచ్చు. బాదం పప్పులను నానబెట్టడం వల్ల యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి లభిస్తాయి. ఇవి వృద్ధాప్య ఛాయల నుంచి కాపాడతాయి. ఇందులోని విటమిన్ B7, ఫోలిక్ యాసిడ్లు క్యాన్సర్‌తో పోరాడతాయి. అంతేగాక పుట్టుకతోపాటు వచ్చే లోపాలను సైతం తగ్గిస్తాయి. బాదం పప్పులను సుమారు 8 గంటలు నానబెట్టాలి.

Related posts