telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

సరిహద్దులలో ఆంక్షలు.. నిఘా పెంపు..ఏప్రిల్ వరకు..

no travelling between indo-pak border at nights

ఆక్రమిత కాశ్మీర్ లో ఉగ్రభూతాని భారత్ తరిమికొట్టేందుకు సిద్ధం అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సరిహద్దులలో గస్తీ పెంపు మరియు రాత్రి వేళల ప్రజల రాకపోకలపై ఆంక్షలు విధించింది సైన్యం. ఈ ఆంక్షలు తాత్కాలికంగా మాత్రమే ఉండనున్నాయి. ఇటీవలే పాక్ ఆక్రమిత కాశ్మీర్ పై భారత సైన్యం చాకచక్యంగా దాడులు చేసిన విషయం తెలిసిందే. ప్రతీకార దాడికి పాక్ సిద్ధమవుతోందన్న వార్తల నేపథ్యంలో అప్రమత్తమైన భారత్ సైన్యం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. సరిహద్దు సమీపంలోని గ్రామాలను ఖాళీ చేయించకపోయినప్పటికీ పౌరుల రాకపోకలపై నిషేధం విధించింది. సరిహద్దుకు ఐదు కిలోమీటర్ల పరిధిలోని ప్రజలు రాత్రిపూట సంచరించవద్దని హెచ్చరికలు జారీ చేసింది.

ఏప్రిల్ మొదటి వారం వరకు రాత్రి సాయంత్రం ఆరు గంటల నుంచి ఉదయం ఏడు గంటల వరకు రాకపోకలపై నిషేధం విధించినట్టు సైన్యం తెలిపింది. అలాగే, సరిహద్దులో రానున్న మూడు రోజులపాటు బీఎస్ఎఫ్ బలగాలు అత్యంత అప్రమత్తంగా ఉంటూ పెట్రోలింగ్‌ను ముమ్మరం చేయాలని కేంద్రం ఆదేశించింది.

Related posts