telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

ధోనీ రికార్డును ఎవరూ బ్రేక్ చేయలేరు… ఛాలెంజ్… : గౌతమ్ గంభీర్

Gautham-Gambhir

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఆగష్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం రోజున అధికారికంగా తన కెరీర్ కు ముగింపు పలికిన విషయం తెలిసిందే. తాజాగా స్టార్ స్పోర్ట్స్ నిర్వహించిన ‘క్రికెట్ కనెక్టెడ్’ షోలో అతిథిగా పాల్గొన్న మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్… ధోని గురించి మాట్లాడుతూ “ధోనీ పేరు చెబితే, ఓ రికార్డు గుర్తుకు వస్తుంది. అది ఎల్లకాలమూ ధోనీ పేరిటే నిలిచి వుంటుందని చెప్పగలను. ఈ విషయమై నేను ఛాలెంజ్ చేయగలను. మూడు ఐసీసీ ట్రోఫీలను దేశానికి అందించిన ఘటన ధోనీదే. టీ-20 వరల్డ్ కప్, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ, 2011 వరల్డ్ కప్ లను ధోనీ నేతృత్వంలోనే గెలిచాము. మరే కెప్టెన్ కూ ఇది సాధ్యం కాదని నమ్ముతున్నాను. సెంచరీల రికార్డులు ఏనాటికైనా బద్దలవుతాయి. భవిష్యత్తులో మరెవరైనా వచ్చి, డబుల్ సెంచరీల విషయంలో రోహిత్ శర్మ రికార్డును బ్రేక్ చేయవచ్చు. కానీ, భారత కెప్టెన్ గా ధోనీ సాధించిన రికార్డు పదిలంగా ఉండిపోతుంది” అన్నారు గంభీర్. న్యూజిలాండ్ లో 2019 వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్ ధోనీ కెరీర్ లో ఆఖరి మ్యాచ్ గా మిగిలిపోయింది.

Related posts