telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు

బంగారం ప్రియులకు అదిరిపోయే శుభవార్త..పడిపోయిన ధరలు

బులియన్‌ మార్కెట్‌లో రెండు రోజులుగా తగ్గిన బంగారం ధరలు తాజాగా మళ్లీ తగ్గాయి. అటు ఢిల్లీ, ఇటు హైదరాబాద్‌లోనూ బంగారం ధరలు బాగా పడిపోయాయి. ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర మాత్రం రూ. 270 తగ్గి రూ. 47,180 పలుకుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 250 తగ్గి రూ. 43,250 వద్ద ఉంది. హైదరాబాద్ విషయానికి వస్తే.. బంగారం ధరలు ఇవాళ భారీగా పడిపోయాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 270 తగ్గి రూ. 44,840 కు చేరగా… అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 250 తగ్గి రూ. 41,100 పలుకుతోంది. బంగారం ధర తగ్గగా.. వెండి ధరలు కూడా భారీగానే తగ్గాయి. కిలో వెండి ధర రూ. 1200 తగ్గి రూ.69,300 వద్ద కొనసాగుతోంది.

Related posts