telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

కలం ఒక ఆయుధం ……….!!!

కవులు కారు కాపినులు
కదిపినా కుదిపినా కవనక్షరాలు
కాకూడదు కల్మషాలతోరణం
కవి(తల)లో కలం కుదుపులో
అడ్డురాని కాపీనం !
కవననుభవం(లో) అహంకారం
కాకూడదు ఆభరణాల హారం !
భావ స్వేఛ్ఛ(లో) ఉండకూడదు బానిసత్వం !
దొర్లించాలి బాధ్యతతో కూడిన
భావ స్వతంత్రం !
భువి పై నించున్నా
అంబారాన్ని అందుకునే ఆశలతో
మారువరాదు అతికి ఉన్న
అడుగులాధారం !
ఎవరికి వారు తారతమ్యాలతో
కదిపినా కూర్చిన
అందరిదీ ఒకటే భావం
ఎవరి కవితలు వారికి
అక్షరాలయుధం !
నేను వ్రాస్తున్నదే నువ్వు వ్రాయాలంటే
నా కవననికి వ్రాయాలి ఒక భావం
ఇందులో ఇమిడిఉన్న
కవులనుబంధం ! అనురాగం !
కవి(తల)లో ఆవేదన…. అనురక్తి……
అనురాగం…… అక్షరజ్ఞానం
కలంతో కూడిన ఆయుధం ……..!

Related posts