telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

నేడు విశాఖలో విజయసాయి రెడ్డి పాదయాత్ర…

ప్రస్తుతంలో ఏపీలో రెండు విషయాలు హాట్ టాపిక్ గా ఉన్నాయి. అందులో ఒక్కటి పంచాయితీ ఎలక్షన్. మరొకటి విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ. అయితే విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ చేసేందుకు సిద్దమౌతున్న సంగతి తెలిసిందే. దీంతో కార్మికులు రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు పేరుతో కార్మికులు ఉద్యమం చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు విజయసాయిరెడ్డి విశాఖ పట్నంలో పాదయాత్ర చేపట్టబోతున్నారు.  విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేసేందుకు కేంద్రం అడుగులు వేస్తున్న తరుణంలో దానికి వ్యతిరేకిస్తూ కార్మికులకు మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసనలు తెలియజేసేందుకు సిద్ధం అయ్యింది.  విశాఖలోని జీవీఎంసీ నుంచి స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ వరకు ఈ పాదయాత్ర చేపట్టబోతున్నారు.  దీనికి సంబంధించిన రూట్ మ్యాప్ ను కూడా సిద్ధం చేశారు.  ఆశీల్ మెట్ట, కంచరపాలెం, ఎన్ఏడి, షీలానగర్, గాజువాక మీదుగా ఈ పాదయాత్ర జరగబోతున్నది.  ఈ పాదయాత్రకు ఉద్యోగ, విద్యార్థి, ప్రజాసంఘాలు మద్దతు ఇస్తున్నాయి.  విజయసాయిరెడ్డితో పాటుగా ఈ పాదయాత్రలో ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు పాల్గొనే అవకాశం ఉన్నది.  

Related posts