telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

రెండు రోజులలో .. 180కోట్ల మద్యం అమ్మకాలు.. న్యూ ఇయర్ సేల్స్ రికార్డు…

liquor shops ap

కొత్త సంవత్సరం మొదలు, కొత్త లక్ష్యాలతో ఉత్సాహంగా జీవితం మొదలు..అలాగే గత సంవత్సరానికి కూడా వీడ్కోలు ఉత్సాహంగా చెప్పారు. సెలబ్రేషన్స్ చూస్తే ఏదో అద్భుతం జరిగినట్టే డిసెంబర్ 31 తేదీ రాత్రికి అంగరంగ వైభవంగా గుడ్ బై చెప్పారు జనాలు. న్యూ ఇయర్ అంటే మద్యం, మద్యం, మద్యం..అన్నట్టుగా ఉంది పరిస్థితి. విచ్చలవిడిగా తాగేశారు, ఊగేశారు, చిందేశారు. ఏ రేంజ్‌లో తాగారో తెలిస్తే..మీకు కిక్ ఎక్కడం ఖాయం.

రద్దీని దృష్టిలో పెట్టుకొని ఒకరోజు ముందుగానే మందు కొని దాచిపెట్టారు కొద్దిమంది డ్రింకర్లు. ఈ కారణం వల్ల డిసెంబర్ 30వ తేదీన తెలంగాణలో రూ.250 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. ఇక 31వ తేదీ సాయంత్రం 5 గంటల వరకే దాదాపు రూ.150 కోట్ల మద్యం సేల్ అయ్యింది. ఇక సాయంత్రం 5 గంటల నుంచి అర్థరాత్రి వరకు యావరేజ్‌గా మరో రూ.30 కోట్ల అమ్మకాలు జరిగి ఉండొచ్చని ఎక్సైజ్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. పోయిన సంవత్సరం డిసెంబర్ 31న రూ.100 కోట్ల మద్యం అమ్మకాలు జరగ్గా..ఈ సారి రూ. 180 కోట్ల మార్క్‌ టచ్ అయ్యింది.

Related posts