telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సుధీర్ బాబు “శ్రీదేవి సోడా సెంటర్”

SSS

యంగ్ హీరో సుధీర్ బాబు, దర్శకుడు కరుణ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం బార్డర్ ‘పలాస’ నేపథ్యంలో అదిరిపోయే నేటివిటీతో సినిమా తీసి మెప్పించాడు కరుణ కుమార్. ఆ తర్వాత మెట్రో కథలు అనే వెబ్ సిరీస్ తెరకెక్కించాడు. తాజాగా సుధీర్ బాబు సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. దీనికి సంబందించిన ప్రీలుక్ పోస్టర్ ను నిన్న రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ సినిమా టైటిల్ ను ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు చిత్రయూనిట్. ఈ సినిమాకు “శ్రీదేవి సోడా సెంటర్” అనే ఇంట్రస్టింగ్ టైటిల్ ను అనౌన్స్ చేసారు. ఇక ఈ సినిమాలో పెళ్లిళ్లకు , ఫంక్షన్లకు లైటింగ్ పెట్టె కుర్రాడిగా కనిపించనున్నాడు సుధీర్. ఇక ఫస్ట్ లుక్ లో బుజం పైన లైట్ లతో చేతిలో సోడా సీసా తో పక్కా పల్లెటూరి కుర్రాడిలా కనిపిస్తున్నాడు సుధీర్ బాబు. ఈ చిత్రాన్ని 70ఎమ్.ఎమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించనున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ మ్యూజిక్ సంగీతం అందించనున్నారు. ఇక సుధీర్ బాబు ఇటీవల వి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.’వి’ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చింది. అయితే ఈ చిత్రంలో సుధీర్ బాబు నటనకు మంచి మార్కులే పడ్డాయి.

Related posts