telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

”కోలో కోలన్న కోలో” అంటూ వచ్చిన నాని పాట…

నాచురల్ స్టార్ నాని సినిమా అంటే అభిమానునల్లో అంచనాలు భారీగా ఉంటాయి. అతడి సినిమా అప్‌డేట్స్‌ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అయితే నాని తాజాగా చేస్తున్న చిత్రం టక్‌జగదీష్ ఈ సినిమా ఏప్రిల్ నెలలో విడుదల చేయనున్నారు. ఈ సినిమాను నాని హీరోగా శివ నిర్వాన రూపొందించారు. ఇందులో పెళ్లి చూపులు ఫేమ్ రీతువర్మ హీరోయిన్‌గా నటిస్తున్నారు. తాజాగా టక్ జగదీష్ సినిమా నుంచి సరికొత్త పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. ”కోలో కోలన్న కోలో” అంటూ సాగుతున్న ఈ పాట అభిమానులను ఆకట్టుకుంది. ఈ సినిమా ఫ్యామిలీ, రొమాన్స్ జానర్స్‌లో తెరకెక్కుతోంది. ఇందులో జగపతి బాబు, రావు రమేష్, నాజర్, ప్రవీన్, ఐశ్వర్య రాజేష్, రోహిని తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాపై అంభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే నాని ఈ సినిమాతో పేరుగా ప్రస్తుతం శ్యామ్ సింగరాయ్ అనే సినిమా కూడా చేస్తున్నాడు. అయితే మరి ఈ సినిమాలతోనైనా నాని అనుకున్న స్థాయి హిట్ అందుకుంటాడేమో వేచి చూడాలి.

Related posts