చెక్ బౌన్స్ కేసులో పూతలపట్టు వైసీపీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబుపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. గతంలో ఆయనిచ్చిన ఓ చెక్ బౌన్స్ కావడంతో ఈ కేసులో ఒంగోలు మొబైల్ కోర్టు మెజిస్ట్రేట్ అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ఒంగోలు పట్టణానికే చెందిన తిప్పారెడ్డి మోహన్ రెడ్డి అనే వ్యక్తి వద్ద 2009లో రూ. 8 లక్షలు ఓ మారు, రూ. 9 లక్షలు మరోమారు అప్పుగా తీసుకున్నారు.
ఎంఎస్ బాబు దాన్ని చెల్లించే నిమిత్తం 2010లో చెక్కులిచ్చారు. అవి బ్యాంకులో బౌన్స్ కావడంతో మోహన రెడ్డి కోర్టును ఆశ్రయించారు. గతంలో ఇదే కేసులో ఎంఎస్ బాబు కోర్టుకు హాజరు కాకపోగా, నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. గడచిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన కోర్టుకు హాజరై వారెంట్ ను రీకాల్ చేయించుకున్నారు. అప్పటి నుంచి ఆయన మ కోర్టుకు హాజరు కాకపోవడంతో మరోసారి వారెంట్ జారీ అయింది.
భగవంతుడి సాక్షిగా చెబుతున్నా..తాను ఏ తప్పు చేయలేదు: నన్నపనేని