తిరుమలకు వచ్చే భక్తులకు కీలక సూచనలు చేసిందిటీటీడీ. దగ్గు, జలుబు, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడే భక్తులు ఈ సమయంలో తిరుమల యాత్రను వాయిదా వేసుకోవడమే మంచిదని సూచించింది టీటీడీ.. ఇక, శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా కరోనా నిబంధనలను పాటించాలని సూచించిన టీటీడీ.. ఈ నెల 21 నుంచి 30వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు బుక్ చేసుకున్న భక్తులు.. కరోనా కారణంగా దర్శనానికి వచ్చే పరిస్థితులు ఏర్పడితే.. వారిని రానున్న 90 రోజుల వరకు దర్శనానికి అనుమతి ఇస్తామని తన ప్రకటనలో పేర్కొంది టీటీడీ. ఇక, కరోనా ఉధృతితో ఇప్పటికే టైంస్లాట్ టోకెన్ల కోటాను నిలిపివేసిన టీటీడీ.. ఇప్పుడు ఆన్‌లైన్ ద్వారా విడుదల చేసే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను కూడా తగ్గించే దిశగా ఆలోచన చేస్తోంది. చూడాలి మరి ఇంకా ఏం జరుగుతుంది అనేది.
previous post