telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

దానిపై కమిటీని నిర్వహించిన తెలంగాణ సర్కార్‌…

bjp and congress fire on kcr on railway project

ఆయుష్మాన్ భారత్‌ను ఆరోగ్యశ్రీ పథకంతో అనుసంధానం చేయడంపై సమీక్షకు తెలంగాణ సర్కార్‌ కమిటీని నియమించింది. ఆరోగ్యశ్రీలో ప్రైవేటు ఆస్పత్రుల ఎంప్యానెల్‌మెంట్‌ విధానాన్నిఈ నలుగురు సభ్యులు సమీక్షించనున్నారు. ఇందులో డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్‌ హెల్త్‌ శ్రీనివాసరావు, వైద్య విద్య డైరెక్టర్‌ రమేశ్‌ రెడ్డి, నిమ్స్‌ డైరెక్టర్‌ మనోహర్‌, వైద్య ఆరోగ్య శాఖ సలహాదారు గంగాధర్‌ సభ్యులుగా ఉన్నారు. 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆరోగ్య శ్రీ తో పాటు ఆయుస్మాన్ భారత్ ని తెలంగాణలో అమలు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గతేడాది చివర్లో నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్టు, ఆయుష్మాన్ భారత్‌తో పాటు ఆరోగ్యశ్రీ పథకాన్ని డొవెటైల్ చేయడానికి నిర్ణయం తీసుకున్నారని గతంలోనే కేంద్రానికి తెలిపారు తెలంగాణ అధికారులు. గతంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆయుష్మాన్ భారత్‌ పథకంపై విభేదాలు చోటు చేసుకున్నాయి… అన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్న ఈ పథకాన్ని తెలంగాణలో కూడా అమలు చేయాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసినా.. ఆయుష్మాన్ భారత్‌ కంటే ఆరోగ్యశ్రీ మెరుగ్గా ఉందంటూ చెప్పుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. చూడాలి మరి దీని పై ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది.

Related posts