telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

హాస్పిటల్ నుండి డిశ్చార్జి అయిన దీదీ…

మమతా బెనర్జీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. మమత పదే పదే కోరడంతో ఆమెను డిశ్చార్జి చేశామంటున్నారు డాక్టర్లు. మమతను డిశ్చార్జ్ చేసే ముందుకు ఆమె ఆరోగ్య పరిస్థితిని సమీక్షించిన డాక్టర్ల బృందం. చికిత్సకు ఆమె చక్కగా స్పందిస్తున్నారని తెలిపింది. మరో 48 గంటల పాటు అబ్జర్వేషన్లో ఉండాల్సిందిగా మమతకు సూచించింది డాక్టర్ల బృందం.  బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నందిగ్రామ్‌ నుంచి పోటీ చేస్తున్న మమతా బెనర్జీ రెండు రోజుల క్రితం గాయపడ్డారు. నామినేషన్‌ వేసిన తర్వాత తనపై కొంత మంది దాడి చేశారన్నది మమత ఆరోపణ. కాగా గాయపడ్డ మతను హుటాహుటిన కోల్‌కతాలోని SSKM ఆస్పత్రిలో చేర్పించారు తృణమూల్‌ నేతలు. ఆరుగురు సభ్యులు గల వైద్య బృందం మమతకు చికిత్స అందించింది. కాగా, చికిత్సకు ఆమె  చక్కగా స్పందిస్తున్నారని, కాలికి గాయమైన చోట వాపు కూడా చాలా వరకూ తగ్గిందనంటున్నారు  డాక్లర్లు. శివరాత్రి రోజున తమ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేయాలని భావించింది తృణమూల్‌ కాంగ్రెస్‌. కానీ, అనూహ్యంగా మమత గాయపడి ఆస్పత్రిలో చేయడంతో… ఆ కార్యక్రమం వాయిదా పడింది.చూడాలి మరి ఎప్పుడు దానిని విడుదల చేస్తారు అనేది.

Related posts